ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారి అవినీతి బాగోతం బయపడుతోంది: హోంమంత్రి

ABN, First Publish Date - 2020-02-23T01:48:48+05:30

తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. రాజధాని భూములు, గనుల తవ్వకం లాంటివాటిల్లో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. రాజధాని భూములు, గనుల తవ్వకం లాంటివాటిల్లో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన సుచరిత.. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వృద్దులు, వ్యాధిగ్రస్తులు మరణిస్తే వారిని రాజధాని రైతులు చనిపోయినట్లుగా చెప్తున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేయడం దురదృష్టం అన్నారు. స్త్రీ జాతిని అవమానించేలా చేసే తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హితవుచెప్పారు. మహిళలు స్నానం చేస్తుంటే చిత్రీకరించారని ప్రచారం చేసి లబ్ది పొందాలని చూడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. 


గత ప్రభుత్వం రైతులకు ఏమైతే ఇస్తానందో అది తమ చేస్తుందని హోంమంత్రి సుచరిత చెప్పారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. అయితే ఆందోళనల్లో బయటవారు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారని సుచరిత ఆరోపించారు. రాజధాని తరలింపు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అనే విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదన్నారు.

Updated Date - 2020-02-23T01:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising