చాగలమర్రి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ABN, First Publish Date - 2020-03-16T19:05:35+05:30
కర్నూలు: చాగలమర్రి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 5వ వార్డు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జెమున్నిసాను తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు.
కర్నూలు: చాగలమర్రి పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 5వ వార్డు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జెమున్నిసాను తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. విత్ డ్రా చేసుకోక పోవడంతో జైమున్నీసా కుమారులపై పోలీసులు అక్రమ మద్యం కేసు నమోదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Updated Date - 2020-03-16T19:05:35+05:30 IST