ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై భేటీ కానున్న హైపవర్ కమిటి

ABN, First Publish Date - 2020-06-04T19:34:41+05:30

విశాఖపట్నం: ఈనెల 5,6,7 తేదీలలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై నియనించిన హైపవర్ కమిటి భేటీ కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఈనెల 5,6,7 తేదీలలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై నియనించిన హైపవర్ కమిటి భేటీ కానుంది. అన్ని కమిటీల నివేదికలను పరిశీలించి తుది నివేదిక ఇస్తామని హైపవర్ కమిటి తెలిపింది. అవసరం అయితే ఈనెల 8వ తేదీన కూడా భేటీ అవుతామని అధికారులు తెలిపారు. తుది నివేదిక ఇచ్చే ముందు నిపుణులు, వివిధ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కమిటిలో కొందమంది ప్రతినిధులు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.


పాలిమర్స్ ప్రభావిత గ్రామాలలో ఈమధ్య కాలంలో ఇద్దరు చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా వారు ఏ కారణంతో చనిపోయారో చెప్పలేమన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తరువాతే ఏ కారణంతో చనిపోయారో చెప్పగలమన్నారు. ప్రస్తుతం మేఘాద్రి గెడ్డ నీటిని ఉపయోగించటం లేదన్నారు. అవసరం అయితే మరోసారి బాధిత గ్రామాలను హైపవర్ కమిటి సందర్శన చేస్తుందని హై పవర్ కమిటి వెల్లడించింది.


Updated Date - 2020-06-04T19:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising