ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై హైకోర్టు సంచలన ఆదేశాలు

ABN, First Publish Date - 2020-08-14T01:12:04+05:30

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసింది. ఈ వ్యవహారంపై ఈశ్వరయ్య ఎట్టకేలకు స్పందించి మీడియా ముందుకొచ్చి తడబడుతూ వివరణ ఇచ్చేసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండానే జంప్ అయ్యారు. అయితే.. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడంతో ఇవాళ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.


కుట్రను ఛేదించండి..!

జడ్జి రామకృష్ణ పిటిషన్‌పై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి ఈశ్వరయ్య కేసులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ అధికారిగా మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్‌ను కోర్టు నియమించింది. రవీంద్రన్‌కు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని హైకోర్టు తెలిపింది. ఈ కేసుల వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఇందుకు సంబంధించి 4 వారాల్లో నివేదికను అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


సర్వత్రా చర్చ!

మొత్తానికి చూస్తే న్యాయమూర్తులపై కుట్ర జరుగుతున్నట్లుగా కోర్టు నమ్ముతోందా..?, భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా..?, మాజీ జడ్జి రామకృష్ణ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయా..?, ఈశ్వరయ్యతో ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా..? అనేదానిపై మీడియా, సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా.. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఈశ్వరయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే.

Updated Date - 2020-08-14T01:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising