ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర భారీగా వాహనాలు

ABN, First Publish Date - 2020-07-02T16:36:17+05:30

అనుమతి లేకుండా ఎవరూ ఆంధ్రాలోకి ప్రవేశించవద్దని అధికారులు చెప్పినప్పటికీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అనుమతి లేకుండా ఎవరూ ఆంధ్రాలోకి ప్రవేశించవద్దని అధికారులు చెప్పినప్పటికీ అటు పొందుగల, ఇటు గరిపాడు చెక్ పోస్టు వద్దకు పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు తరలి వస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లాలని ప్రాధేయపడినప్పటికీ పాసులు లేకుంటే అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడంతో అంతా నిరాసతో వెనుదిరుగుతున్నారు. 


వివాదం మరింత జఠిలమైంది. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఏపీకి రాకపోకలపై నిషేధం మరింత ఎక్కువైంది. పాసులు, ప్రత్యేక అనుమతలు లేకుండా ఎవరినీ అనుమతించకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి లేకుండా హడావుడిగా వస్తున్నవారు నిరాశగా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.


హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉధృతం అవుతుండడంతో రెండు, మూడు రోజుల్లో లాక్ డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జరుగుతుండడంతో తెలంగాణలో ఏపీ వాసులు ఆంధ్రాకు ప్రయాణమవుతున్నారు. దీంతో నల్గొండ, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పొందుగల చెక్ పొస్టు వద్ద, కృష్ణా, నల్గొండ సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రాకు క్యూ కడుతున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను ఏపీలోకి అనుమతిస్తామని పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని లేని పక్షంలో సరిహద్దువద్దకు రావద్దని ఏపీ డీజీపీ సూచించారు. స్పందన యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత అత్యవసరమైతేనే అనుమతిస్తామని అన్నారు.

Updated Date - 2020-07-02T16:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising