ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

ABN, First Publish Date - 2020-09-16T18:37:41+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంవల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందూనదీ తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 


నంద్యాల డివిజన్‌లో భారీ వర్షాలు కురవడంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అర్ధరాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు, రుద్రవరం మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హంద్రీ, కుందూనదులు వరదలతో పోటెత్తాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


కర్నూలు జిల్లాలోని చిన్నకమ్మలూరు, యల్లావత్తురు మధ్య వాగు వరద ప్రవాహం ప్రమాద స్థాయిలో ఉంది. అయితే.. ఇద్దరు యువకులు బైక్‎తో వాగును దాటేందుకు యత్నించారు. దీంతో వాగులో వస్తున్న వరదనీటి ప్రవాహానికి బైక్‎తో పాటు ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆ ఇద్దరి యువకుల ప్రాణాలను రక్షించారు. జిల్లాలో నాలుగు చోట్ల అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-09-16T18:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising