ఏడుగురు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉంది: డీజీపీ
ABN, First Publish Date - 2020-05-09T20:25:55+05:30
ఏడుగురు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఎంతో శ్రమించారని, ప్రజల రక్షణలో పడి వారి రక్షణ మర్చిపోయారని కొనియాడారు.
విశాఖ: ఏడుగురు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఎంతో శ్రమించారని, ప్రజల రక్షణలో పడి వారి రక్షణ మర్చిపోయారని కొనియాడారు. కేర్ ఆస్పత్రిని డీజీపీ సందర్శించారు. కేర్‌లో చికిత్స పొందుతున్న ఏడుగురు పోలీసులకు ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరికి రివార్డులు ప్రకటిస్తామని సీఎం జగన్ అన్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Updated Date - 2020-05-09T20:25:55+05:30 IST