‘ఆయన వేధింపులు ఇక భరించలేను..’
ABN, First Publish Date - 2020-09-14T12:07:11+05:30
‘కొన్ని నెలలుగా వేధింపులు.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక రకాలుగా టార్చర్ పెడుతున్నాడు. నేను గుంటూరు టూటౌన్ సెబ్‌స్టేషన్ ఇన్‌చార్జ్‌గా వచ్చినపుడు ఆయన వేధింపులు
గుంటూరు : ‘కొన్ని నెలలుగా వేధింపులు.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక రకాలుగా టార్చర్ పెడుతున్నాడు. నేను గుంటూరు టూటౌన్ సెబ్‌స్టేషన్ ఇన్‌చార్జ్‌గా వచ్చినపుడు ఆయన వేధింపులు తాళలేకపోయా.. వెంటనే పెదకూరపాడుకు పోస్టింగ్ మార్పించుకున్నాను. అయినా నన్ను వదల్లేదు. బయటకు చెప్పుకోలేని విధంగా.. నాతో చాలా నీచంగా, అసభ్యకర పదజాలంతో మాట్లాడేవారు’ అంటూ ఆత్మహత్యాయత్నం చేసిన గుంటూరు జిల్లా పెదకూరపాడు సెబ్ ఎస్‌ఐ సీహెచ్ గీత.. విచారణ అధికారి ఎదుట తన మనోవేదనను వెల్లగక్కారు.
గుంటూరు సెబ్ సూపరింటెండెంట్ ఎన్.బాలకృష్ణన్ వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఏర్పాటైన విచారణ బృందం ఈఎస్ తీరుపై శని, ఆదివారాల్లో గుంటూరులో విచారణ జరిపింది. శనివారం గీత ఇంటికి వెళ్లి విచారణ చేపట్టగా.. తనపట్ల బాలకృష్ణన్ వ్యవహరిస్తున్న తీరును గీత వివరించినట్లు తెలిసింది. కాగా.. బాలకృష్ణన్ చేతిలో వేధింపులకు గురవుతున్న పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది విచారణ అధికారుల ఎదుట ఈఎస్ అరాచకాల గురించి ఏకరువుపెట్టినట్లు సమాచారం.
Updated Date - 2020-09-14T12:07:11+05:30 IST