ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు ప్రజలకు జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2020-11-13T21:20:49+05:30

తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని జగన్ అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాలు దీపాలు వెలగాలని జగన్ ఆకాంక్షించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో జగన్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు జగన్, భారతి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


మరోవైపు ఏపీలో దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయాన్ని ఇచ్చారు. ఎందుకంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-13T21:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising