కృష్ణా జిల్లాలో మనసును కదిలించే దృశ్యం
ABN, First Publish Date - 2020-04-05T17:10:21+05:30
ఆకలితో అలమటిస్తూ ముళ్ళతో ఉన్న పామాయిల్ గెలను ఓ యాచకురాలు తింటున్న దృశ్యం ఇది.
కృష్ణా: ఈ పక్కనున్న ఫొటో నేటి లాక్‌డౌన్‌లో ఆకలికేకలకు ప్రతీకగా నిలుస్తోంది. నడిరోడ్డే ఆవాసంగా బతికే యాచకుల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆకలితో అలమటిస్తూ ముళ్ళతో ఉన్న పామాయిల్ గెలను ఓ యాచకురాలు తింటున్న దృశ్యం ఇది. హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్‌పై ఆంధ్రజ్యోతి కెమేరా కంటికి చిక్కింది. లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితమై పోయారు. దుకాణాలు, ఆఫీసులు, అన్నీ బంద్ అయ్యాయి. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో యాచక వృత్తిలో ఉండే ఇలాంటి వాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. ఇలా కాలం వెళ్లబుచ్చుతున్నారు.
Updated Date - 2020-04-05T17:10:21+05:30 IST