ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో.. అర్ధరాత్రి గృహనిర్బంధాలు

ABN, First Publish Date - 2020-10-27T08:46:06+05:30

చిత్తూరు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు రెచ్చిపోయారు. టీడీపీ ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధంలో ఉంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ  నేతల ఇళ్ల చుట్టూ పోలీసుల భారీ మోహరింపు..హౌస్‌ అరెస్టులు

హంద్రీ-నీవా పాదయాత్ర భగ్నం


తిరుపతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు రెచ్చిపోయారు. టీడీపీ ముఖ్య నేతలందరినీ గృహనిర్బంధంలో ఉంచారు. వారు బయటకు రాకుండా ఇళ్ల చుట్టూ భారీసంఖ్యలో మోహరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. కుప్పం నియోజకవర్గంలో హంద్రీ-నీవాకు సంబంధించిన కుప్పం బ్రాంచి కెనాల్‌ పూర్తి కాకపోవడంతో నియోజకవర్గ టీడీపీ నేతలు సోమవారం నుంచి  నెలాఖరు వరకూ పాదయాత్ర చేయాలని భావించారు. సోమవారం రామకుప్పం మండలం బయపరెడ్లపల్లె నుంచీ పాదయాత్ర మొదలుపెట్టి నెలాఖరుకు కుప్పం చేరుకునేలా కార్యక్రమం రూపొందించుకున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రే పోలీసు బలగాలు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతల ఇళ్లను చుట్టుముట్టాయి. శాంతిపురం మండలంలో పాదయాత్రకు ప్రణాళిక రచించిన ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి తదితరులను గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే పోలీసుల నిర్బంధాలను అధిగమించి.. రామకుప్పం మండలంలో హంద్రీ-నీవా కాలువ వెంబడి పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర ప్రారంభించారు. 

Updated Date - 2020-10-27T08:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising