అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-09-01T10:01:23+05:30
అప్పుల బాధతో నేతన్న ఆత్మహత్య
ధర్మవరంఅర్బన్, ఆగస్టు 31: అనంతపురం జిల్లా ధర్మవరం సంజయ్‌నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు బాలచిదంబరస్వామి(35) అప్పుల బాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే రెండు మగ్గాలను ఏర్పాటు చేసుకుని చీరలు నేస్తూ స్వామి కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్ కారణంగా పనిలేకపోవడం, రూ.5 లక్షల అప్పు తీర్చే మార్గంలేక ఇంట్లో ఉరేసుకుని మరణించాడు.
Updated Date - 2020-09-01T10:01:23+05:30 IST