జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం ప్రక్షాళన
ABN, First Publish Date - 2020-11-13T09:21:39+05:30
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, అనధికార వెంచర్ల గుర్తింపు కార్యక్రమం విశాఖ మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పట్టణ ప్రణాళికా విభాగంలోని
రాష్ట్రంలోనే అత్యధిక అక్రమ నిర్మాణాలు, అధిక వెంచర్లు
10 మంది అధికారులపై బదిలీ వేటు
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, అనధికార వెంచర్ల గుర్తింపు కార్యక్రమం విశాఖ మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లోని పట్టణ ప్రణాళికా విభాగంలోని పలువురు అధికారుల స్థానాలకు ఎసరు పెట్టింది! రాష్ట్రంలోనే అత్యధిక అక్రమ కట్టడాలున్న నగరంగా ఈ సంస్థ నిలవడాన్ని తీవ్రంగా పరిగణించిన పురపాలకశాఖ ఉన్నతాధికారులు అందుకు బాధ్యులుగా గుర్తిస్తూ వారిపై కొరడా ఝళిపించారు! వారి స్థానాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీలు), పట్టణాభివృద్ధి సంస్థ (‘ఉడా’)ల్లోని ‘సమర్ధుల’ను నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఆదేశాలిచ్చారు. ఒక్కసారిగా ఏకంగా జీవీఎంసీలోని వివిధ స్థాయుల్లోని 10మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు స్థానభ్రంశం కలిగించడం డీటీసీపీతోపాటు పురపాలక శాఖలో చర్చనీయాంశమైంది.
అయితే.. సమర్ధులని గుర్తించి మరీ జీవీఎంసీ ‘ప్రక్షాళన’కు, ‘మెరుగైన పని తీరు’ కోసం ఉన్నతాధికారులు అక్కడికి బదిలీ చేసిన అధికారుల్లోనే కొద్దిమంది పనితీరుపై.. ఇప్పటి వరకూ వారు పనిచేసిన, చేస్తున్న స్థానాల్లోనే తీవ్ర ఆక్షేపణలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఇక్కడ గమనార్హం! రాష్ట్రవ్యాప్తంగా యూఎల్బీలు, ‘ఉడా’ల్లో మొత్తం 52,509 అక్రమ కట్టడాలు, 10,477 అనధికార లే అవుట్లు వివిధ దశల్లో ఉన్నట్లుగా తేలింది. వీటిల్లో జీవీఎంసీ 6,739 అక్రమ నిర్మాణాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వీటికితోడు దీని పరిఽధిలో 214 అనుమతిలేని లే అవుట్లు ఉన్నాయని గుర్తించారు.
Updated Date - 2020-11-13T09:21:39+05:30 IST