ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయంబేడు లింక్‌తో.. ఏడుగురికి?

ABN, First Publish Date - 2020-06-06T09:16:47+05:30

గుంటూరు నగరంలోని ఏటుకూరు బైపాసు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌లో గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : గుంటూరు నగరంలోని ఏటుకూరు బైపాసు రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌లో గత ఆదివారం 95 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ వివరాలు ఇంకా బయటకి రాలేదు. శ్రీనివాసరావుపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 96 మందికి ఈ వారం మొదట్లో కరోన టెస్టులు నిర్వహించారు. ప్రతీ గురువారం ల్యాబ్‌కు సెలవు కావడంతో వాటి రిపోర్టులు శుక్రవారం విడుదల అవుతాయని అంతా భావించారు.


అధికారవర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో హోల్‌సేల్‌ వ్యాపారి అయిన గుంటూరు సంపత్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ అని చూపించారు. శ్రీనివాసరావుపేటలో పాజిటివ్‌ కేసు కాంటాక్ట్స్‌ని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు క్వారంటైన్‌కు తరలించాయి. ఇటీవల కొత్తగా నాలుగు పాజిటివ్‌ కేసలు ఇక్కడ నమోదయ్యాయి. దాంతో వారి ప్రాథమిక సంబంధీకులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. ద్వితీయ సంబంధీకులను మాత్రం ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించారు. కేసు నమోదైన వీధులను బ్యారికేడింగ్‌తో కట్టడి చేశారు. 

Updated Date - 2020-06-06T09:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising