ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులపై గోప్యత ఎందుకు?

ABN, First Publish Date - 2020-04-08T10:35:10+05:30

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచుతుందని మాజీ మంత్రి నక్కా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నియంత్రణకు ప్రభుత్వం మేధావుల సూచనలు తీసుకోవాలి

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు


గుంటూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఎంతమందికి పాజిటివ్‌గా తేలింది.. ఎందరు క్వారంటైన్‌లో ఉన్నారు.. అసలు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎంత అనే విషయాలను బయటపెట్టాలన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంపై కరోనా పంజా విసురుతున్న వేళ రాజకీయాలు చేయటం తగదన్నారు.


చంద్రబాబు సూచనలు తీసుకోవటం ఇష్టం లేకపోతే ఇతర మేధావులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర చేస్తున్న సాయాన్ని తాము చేస్తున్నట్లు చెప్పుకొంటూ భౌతికదూరం పాటించాల్సిన సమయంలో వైసీపీ నేతలు గుంపులు, గుంపులుగా తిరగటం ఏమిటని నిలదీశారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందని సమావేశంలో పాల్గొన్న నేతలు మన్నవ సుబ్బారావు, మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, డేగల ప్రభాకరరావులు విమర్శించారు. సమావేశంలో నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, కంచర్ల శివరామయ్య, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-08T10:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising