ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ నమోదు చేసుకుంటేనే.. ఓటు

ABN, First Publish Date - 2020-10-04T14:03:21+05:30

కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్‌ జాబితానే ఎన్నికల సంఘం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

గతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దు

ఆన్‌లైన్‌లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్‌ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించ నుంది. గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు. అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హ క్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. సీఈవో ఆంధ్ర.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఇప్ప టికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకా శం కల్పించారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉ న్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

 

2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగిన ప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపోయారు. ఈ దఫా కూడా ఇం చుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయ స్కూల్‌ అసిస్టెంట్‌ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది. జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కళాశా ల అధ్యాపకులు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలి గిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొంద వచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవ డంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు. 


ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్న మెంట్‌ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటి ల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది. ఉపాధ్యా యులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్న స్కూల్‌ అసిస్టెంట్‌ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యా యులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పిం చాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘా నికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు. 

Updated Date - 2020-10-04T14:03:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising