కొవిడ్ నిబంధనల మేరకు వీరారాధన ఉత్సవాలు
ABN, First Publish Date - 2020-12-02T05:05:27+05:30
పల్నాటి వీరారాధన ఉత్సవాలు సంప్రదాయంగా నిర్వహించుకుందామని గురజాల రూరల్ సీఐ ఉమేష్‌కుమార్, ఎస్‌ఐ రవికృష్ణ అన్నారు.
సభలో మాట్లాడుతున్న ఎస్‌ఐ రవికృష్ణ
కారంపూడి, డిసెంబరు 1: పల్నాటి వీరారాధన ఉత్సవాలు సంప్రదాయంగా నిర్వహించుకుందామని గురజాల రూరల్ సీఐ ఉమేష్‌కుమార్, ఎస్‌ఐ రవికృష్ణ అన్నారు. మంగళవారం వీర్ల దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాలపై అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో బాలునాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం కొవిడ్ ఉన్న కారణగా ఉత్సవాలను పరిమితంగా చేసుకుందామన్నారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు మాట్లాడుతూ అధికారుల ఆదేశాలకు అనుగుణంగానే ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాదరావు, ఈవోపీఆర్డీ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T05:05:27+05:30 IST