ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేర నియంత్రణకు పకడ్బందీ చర్యలు

ABN, First Publish Date - 2020-12-29T06:09:33+05:30

అర్బన్‌ జిల్లా పరిధిలో గతంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య త గ్గిందని ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.

నేరసమీక్ష నిర్వహిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు, డిసెంబరు 28: అర్బన్‌ జిల్లా పరిధిలో గతంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య త గ్గిందని ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. అయితే చోరీ కేసుల్లో ఆశించిన స్థాయిలో సొత్తు రికవరీ చేయలేకపోయామన్నారు. సోమవారం ఆయన పోలీసు కార్యాలయంలో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్‌లో గతేడాది 5,186 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 9,473 కేసులు నమోదు అయ్యాయయన్నారు. గతేడాది 31 హత్యలు జరగ్గా, ఈ ఏడాది 28 మాత్రమే జరిగాయన్నారు. గతేడాది మరణాలు సంభవించిన రోడ్డు ప్రమాదాలు 742 జరగ్గా, 299 మంది మర ణించారని, ఈ ఏడాది 205 జరగ్గా, 216  మృత్యువాత పడ్డారన్నారు. రానున్న నూతన సంవత్సరంలో చోరీ కేసులను తగ్గించి రికవరీ శాతాన్ని పెంచేందుకు  చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుట్కాపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. విజుబుల్‌ పోలిసింగ్‌తో నేరాల సంఖ్య కొంతవరకు తగ్గటమే గాక భరోసా పెరిగిందన్నారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసింగ్‌కు మరింత పదును పెట్టి మూడోకన్ను తెరవనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఈశ్వరరావు, గంగాధరం, డీసీఆర్‌బీ డీఎస్పీ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T06:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising