టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలి
ABN, First Publish Date - 2020-12-02T05:04:22+05:30
పేదల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఎన్టీఆర్ గృహాలను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని ఎమ్మెల్సీ లోకేష్ సహా ఎమ్మెల్యేలు ప్రదర్శన నిర్వహించారు.
టీడీపీ నేతల ప్రదర్శన
తుళ్లూరు, డిసెంబరు 1: పేదల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఎన్టీఆర్ గృహాలను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని ఎమ్మెల్సీ లోకేష్ సహా ఎమ్మెల్యేలు ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ వచ్చే సమయంలో బ్యానర్‌ను ప్రదర్శించారు. రాజధాని అమరావతితో పాటు, రాష్ట్రంలో కట్టిన 8 లక్షల ఇళ్లు పేదలకు రెండేళ్లు కావస్తున్నా వైసీపీ ప్రభుత్వం అందజేయకపోవడంపై ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన అవినీతిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాగా.. తుళ్లూరు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం హడావుడిగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.
Updated Date - 2020-12-02T05:04:22+05:30 IST