ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలే వరకు..ఉద్యమం

ABN, First Publish Date - 2020-08-09T10:05:31+05:30

మూడు రాజధానుల నిర్ణయం పనికిమాలిన చర్యగా రైతులు అభివర్ణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు రాజధానుల నిర్ణయం పనికిమాలిన చర్య

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు

234వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 

రైతులకు సంఘీభావం తెలిపిన ప్రత్తిపాటి 


తుళ్లూరు, తాడికొండ, ఆగస్టు 8: మూడు రాజధానుల నిర్ణయం పనికిమాలిన చర్యగా రైతులు అభివర్ణించారు. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచే పాలన కొనసాగించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలు శనివారం 235వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, బోరుపాలెం, నీరుకొండ, రాయపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం తదిర దీక్షా శిబిరాల్లో రైతులు ప్ల్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని భూములు ఇచ్చిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువుగా ఉన్నారని పేర్కొన్నారు.


మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మందడం బిబిరంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.  సీఎం జగన్‌ ఆడించినట్లుగా ఎమ్మెల్యే ఆడుతున్నారని మహిళలు తెలిపారు. అమరావతికి ద్రోహం చేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వె ంటనే రాజీనామా చేయాలని డిమాండు చేశారు.  పార్టీ వేరు ప్రభుత్వం వేరంటూ బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని వెలగపూడి రైతులు మండిపడ్డారు. మహిళా రైతులు అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి ఇళ్ల ముందు దీపాలు పెట్టి న్యాయస్థానాల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. 


ద్వంద వైఖరి సరికాదు..

పలు దీక్షా శిబిరాలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని చెప్పటం విడ్డూరమన్నారు. ద్వంద వైఖరితో మాట్లాడటం మంచిది కాదన్నారు. వంద సంవత్సరాలుగా ఉన్న అయోధ్య సమస్యను పరిష్కరించిన విధంగానే,  అమరావతి కొనసాగించి రైతులకు న్యాయం చేయాల్సిన భాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎంతమంది కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయదేవత  కరుణిస్తుందని పేర్కొన్నారు. యర్రబాలెంలో నిరసన కార్యక్రమంలో జెడ్పీటీసీ  మాజీ సభ్యురాలు జయసత్య, రైతు సంఘ నాయకులు ఉమామహేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-09T10:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising