పెండింగ్‌లో ఉన్న రూ.2500 కోట్లు తక్షణమే చెల్లించాలి
ABN, First Publish Date - 2020-12-05T05:34:58+05:30
పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులు రూ.2500 కోట్లు తక్షణమే చెల్లించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తెలిపారు.
గుంటూరు (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 4: పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులు రూ.2500 కోట్లు తక్షణమే చెల్లించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ చేపట్టిందన్నారు. 2018-19లో గ్రామాల్లో రూ.2500 కోట్లుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎన్నికలు రావడంతో ఆ బిల్లులు నిలిపేశారన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే నరేగా బిల్లులు నిలుపదల చేయడం దుర్మార్గమని శ్రావణ్ మండిపడ్డారు. అన్ని రంగాలను నాశనం చేసిన జగన్ సీఎం పదవికి అనర్హులని శ్రావణ్ కుమార్ తెలిపారు.
Updated Date - 2020-12-05T05:34:58+05:30 IST