ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలగపూడి ఘటనకు వైసీపీదే బాధ్యత: పిల్లి మాణిక్యాలరావు

ABN, First Publish Date - 2020-12-29T20:29:44+05:30

వెలగపూడి ఘటనకు వైసీపీదే బాధ్యత అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వెలగపూడి ఘటనకు వైసీపీదే బాధ్యత అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు  అన్నారు. వైకాపాలోని అంతర్గత విబేదాల వల్లే ఘర్షణ చెలరేగిందని తెలిపారు. వెలగపూడి ఘటనకు బాధ్యత వహించి హోం మంత్రి సూచరిత, ఎంపీ నందిగం  సురేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి ఘర్షణలు లెవనెతున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని దారి మళ్లించడానికే వెలగపూడి ఘటన అని ఆయన ఆరోపించారు. ఘర్షణ జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. హోం మంత్రి సుచరిత ఆదేశాల మేరకే పోలీసులు ఆ రకంగా నడుచుకున్నారన్నారు. ఎంపీ నందిగం సురేష్ యే ఘర్షణకు కారణం అని బాధితులే చెప్తున్నారని తెలిపారు. కులం, మతం లేదని చెప్పే హోంమంత్రి రైతుల చేతికి బేడీలు వేస్తే  వారిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతుంటే వాటిపై హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని పిల్లి మాణిక్యాలరావు హెచ్చరించారు. 

Updated Date - 2020-12-29T20:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising