ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పడం... మడమ తిప్పడం జగన్‌కు అలవాటైంది

ABN, First Publish Date - 2020-08-09T10:06:49+05:30

మాట తప్పడం.. మడమ తిప్పడం సీఎం జగన్‌కు అలవాటైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మాట తప్పడం.. మడమ తిప్పడం సీఎం జగన్‌కు అలవాటైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. శనివారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి  మూడు చొప్పున 15 కోట్ల మాస్కులు పంపిణీ చేయటం చేతగాని సీఎం, క్వారెంటైన్‌ కేంద్రాల్లోని వారికి మూడు పూటలా భోజనం పెట్టలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు.


ముందు మూడు మాస్కులిచ్చి తరువాత మూడు రాజధానుల గురించి ఆలోచించాలన్నారు. రాజధానిని అమరావతి నుంచి ఎందుకు మారుస్తున్నారో కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకైనా తెలుసా అని ప్రశ్నించారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు ఊరూరా గగ్గోలు పెట్టి ఓట్లు దండుకొని నేడు వికేంద్రీకరణ అంటూ ప్రస్తుతం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అయ్యాక సీఎం మోహం కూడా చూడని వైసీపీ ఎమ్మెల్యేలు రాజధాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.  

Updated Date - 2020-08-09T10:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising