మంత్రి కొడాలి మానసిక రోగి
ABN, First Publish Date - 2020-12-02T05:10:18+05:30
మంత్రి కొడాలి నాని ఓ మానసిక రోగి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు మానుకొండ శివప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావులు విమర్శించారు.
టీడీపీ నేతలు మానుకొండ, కనపర్తి
గుంటూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మంత్రి కొడాలి నాని ఓ మానసిక రోగి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు మానుకొండ శివప్రసాద్, కనపర్తి శ్రీనివాసరావులు విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మానుకొండ మాట్లాడుతూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన కొడాలి నాని రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబుపై తీవ్ర పదజాలం వాడితే అదేస్థాయిలో తాము మాట్లాడతామన్నరు. సీఎం జగన్ ఇచ్చే బిస్కెట్లకి ఆశపడి ఇష్టానుసారంగా మాట్టాడితే నాలుక కొస్తామంటూ మండిపడ్డారు. రైతులను ఆదుకోవాలని చంద్రబాబు అసెంబ్లీలో పోరాడుతుంటూ సస్పెండ్ చేయటం వైసీపీ ప్రభుత్వ డొళ్ల తననానికి నిదర్శనమని కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు తీవ్ర నిరసనతోనే అర్ధరాత్రి జీవోని విడుదల చేసి రూ.590.51 కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించారని అన్నారు. సమావేశంలో నేతలు ఎరమాల విజయ్ కిరణ్, ఎల్లావుల అశోక్‌యాదవ్, మద్దిరాల గంగాధర్, కంచర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T05:10:18+05:30 IST