ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి ముస్లింలే గోరీ కడతారు

ABN, First Publish Date - 2020-11-14T03:13:03+05:30

వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు తగిన గుణపాఠం చెప్పి గోరీ కడతారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ అన్నారు.

సలాం కుటుంబానికి న్యాయం జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న టీడీపీ నేత నసీర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వానికి  ముస్లింలు తగిన గుణపాఠం చెప్పి గోరీ కడతారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ అన్నారు. నంద్యాల అబ్దుల్‌ సలాం కుటుంబానికి అల్లా జన్నత్‌ ప్రసాదించాలంటూ శుక్రవారం ఆయన పార్టీ నేతలు, మతపెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారుకులైన వారిపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సలాం కుటుంబానికి సీఎం జగన్‌ ఆర్థికసాయం అందించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలపై ముస్లింలంతా ఒకటికావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు ఇలాహి, హస్సన్‌ బాషా, నియాజి షేక్‌, ఎల్లావుల అశోక్‌, జమీర్‌, ఎండీ హఫీజ్‌, జస్వంత్‌ జ్యోతుల, అంకమ్మరావు తదితరులతో పాటు ముస్లింపెద్దలు పాల్గొన్నారు. 

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులను శిక్షించాలి


నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పశ్చిమ టీడీపీ నేతల డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర ఆధర్యంలో గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని కన్నెంగంటి హనుమంతు విగ్రహం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐటీసీ వరకు కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసులను శాశ్వతంగా విధులనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు లాల్‌ వజీర్‌, షేక్‌ చిన బాజీ, ఖాదర్‌బాషా, బుడే, అస్మా, నాగూర్‌, రహీం, ఖాసీం సైదా, పిల్లి మాణిక్యరావు, మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, కొల్లి అనిల్‌, కసుకుర్తి హనుమంతరావు, తుమ్మల నాగేశ్వరరావు, ఉప్పుతల్ల సాంబయ్య, చితకాయల రామారావు, దొంతా నాగసుశీల తదితరుల పాల్గొన్నారు.  

సలాం కేసును సీబీఐకి అప్పగించాలి


కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని సలాం న్యాయపోరాట కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు. చలో నంద్యాల కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని లాడ్జిసెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం బీఆర్‌ అంబేద్కర్‌ కల్పించిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. కార్యక్రమంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్‌ సుబ్లీ, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎండీ ఫాతుల్లా, అరుణకుమార్‌, సయ్యద్‌ అప్సర్‌, అబ్దుల్‌ ఖాదర్‌, పోతిన రాము, మౌలానా హుస్సేన్‌, రాజబాబు, రమేష్‌, ఎస్‌.వెంకటరమణ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T03:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising