ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-16T14:07:52+05:30

తాడేపల్లి మండలం, పట్టణ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్(గుంటూరు)‌: తాడేపల్లి మండలం, పట్టణ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. బుధవారం ఒక్కరోజే 70  కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉండవల్లిలోనే 34 కేసులు వచ్చాయి. దీంతో గ్రామంలో మొత్తం 90 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కలెక్టరు ఉత్తర్వుల మేరకు పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఎంపీడీవో రామ్‌ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. పాలు, నిత్యావసర దుకాణాలు మాత్రమే ఉదయం ఆరు నుంచి 9 గంటల వరకు తెరవాలన్నారు. కేసులు చూస్తే ఉండవల్లి సెంటరు జామాయిల్‌తోట బజారులో పది కేసులు గుర్తించారు. వెలగపూడి సచివాలయం, హైకోర్టులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించి 8, రామ్‌ప్రియ అపార్టుమెంటులో 4, కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసు రోడ్డులో 2, షణ్ముఖ టవర్స్‌లోని సచివాలయం ఉద్యోగికి, సీపీఎం ఆఫీసు రోడ్డులో 4, వంశీ పాఠశాల వెనుక ప్రాంతంలో 1, జవహర్‌ విద్యానికేతన్‌ పాఠశాలరోడ్డులో 4, కరివేపాకుతోట బజారులో 1, గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ప్రాంతంలో 2, ఆంజనేయస్వామిగుడి ప్రాంతంలో 3, బొసుబొమ్మ సెంటరులో లారీడ్రైవర్‌కి, అమరారెడ్డి నగర్‌లో 1 కేసు చొప్పున వచ్చాయి.  పట్టణ పరిధిలో మణిపాల్‌ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకున్న వారిలో 21 మందికి, నులకపేటలో 2, కుంచనపల్లిలో 1, సలాం హోటల్‌ సెంటరులో 1, తాడేపల్లిలో 11 కేసులు నమోదయ్యాయి.  


Updated Date - 2020-07-16T14:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising