విద్యుత్‌భవన్‌లో స్వచ్ఛసర్వేక్షణ్
ABN, First Publish Date - 2020-12-29T06:19:01+05:30
పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌భవన్‌లో సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వచ్ఛసర్వేక్షణ్‌లో విద్యుత్ ఎస్‌ఈ విజయకుమార్, ఉద్యోగులు
గుంటూరు, డిసెంబరు 28: పొన్నూరు రోడ్డులోని విద్యుత్‌భవన్‌లో సోమవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీసీపీడీసీఎల్ గుంటూరు సర్కిల్ ఆపరేషన్ ఎస్‌ఈ ఎం.విజయకుమార్‌తో పాటు అధికారులు, ఉద్యోగులంతా చీపుర్లు, పార, పలుగు పట్టుకొని విద్యుత్ భవన్ ఆవరణలో వ్యర్ధాలను తొలగించారు. కార్యక్రమంలో ఈఈలు భాస్కరబాబు, వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఈలు సుబ్బరామమ్మ, జయలక్ష్మి, గిరిధర్, వీరయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T06:19:01+05:30 IST