ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవిత్ర హోమం

ABN, First Publish Date - 2020-03-16T07:14:02+05:30

అమరావతే ఏపీకి ఏకైకక రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ సుదర్శన హోమం నిర్వహించారు. ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి రైతులు, రైతులు కూలీలు ఈ హోమంలో పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్దండ్రాయునిపాలెంలో సుదర్శన హోమం 

హాజరైన 29 గ్రామాల ప్రజలు, బీజేపీ నేతలు

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని పూజలు 

89వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు


 గుంటూరు, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, మార్చి 15(ఆంధ్రజ్యోతి):   అమరావతే ఏపీకి ఏకైకక రాజధానిగా కొనసాగేలా చూడాలంటూ సుదర్శన హోమం నిర్వహించారు. ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అమరావతి రైతులు, రైతులు కూలీలు ఈ హోమంలో పాల్గొన్నారు. ఉదయం 7.25 గంటలకు మొదలైన ఈ హోమం నాలుగు గంటలవరకు కొనసాగింది అనంతరం పూర్ణాహుతి ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రావెల కిషోర్‌ బాబు, వల్లూరి జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. అమరావతి దేవతల రాజధానిగా ఉందని చరిత్ర చెబుతోందని.. కానీ వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో అరాచకంగా వ్యవహరిస్తోందని నేతలు ఆరోపించారు. 


నట్టేట మునిగాం..

మా జీవితాలతో పాటు భావితరాలు బాగుంటాయని ఆశపడ్డాం... నేడు ప్రభుత్వంలోకి వచ్చిన పెద్దల నిర్ణయాలతో నట్టేట మునిగాం.. అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు వరుసగా 89వ రోజూ ఆదివారం కొనసాగించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ మందడం, తుళ్లూరు గ్రామాలల్లో మహాధర్నా చేపట్టారు. రాయపూడి, వెలగపూడి,  పెదపరిమి,  కృష్ణాయపాలెం, తాడేపల్లి  తదితర ప్రాంతాలల్లో రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు. రాజధాని కోసం భూములిచ్చామని, రైతుల త్యాగాలను గుర్తించకుండా ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపించారు.


మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా మంగళగిరి మండలం యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు చేపట్టిన రిలే నిరసన దీక్షలు ఆదివారంతో 89వ రోజుకు చేరాయి. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లిలో నిరసనలు కొనసాగాయి. పెనుమాకలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ  జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, ఏఐకెఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి తోకల బాబూరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి యు.గనిరాజు, ప్రగతి శీల న్యాయవాద జిల్లా కార్యదర్శి ఎస్‌.సురేష్‌లు విచ్చేసి మద్దతు ప్రకటించారు. తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు ఆదివారం నాటికి 72వ రోజుకు చేరుకున్నాయి.

Updated Date - 2020-03-16T07:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising