ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసరావుపేటకు.. సబ్‌ కలెక్టర్‌.. ఆర్డీవో స్థాయి నుంచి పెరిగిన హోదా

ABN, First Publish Date - 2020-08-08T14:57:07+05:30

నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌ హోదాను ప్రభుత్వం పెంచింది. సబ్‌ కలెక్టర్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో తెనాలికి మాత్రమే సబ్‌ కలెక్టర్‌ హోదా ఉండేది. తెనాలి సరసన నరసరావుపేట డివిజన్‌ చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డివిజన్‌ రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు బదిలీ


నరసరావుపేట(గుంటూరు): నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌ హోదాను ప్రభుత్వం పెంచింది. సబ్‌ కలెక్టర్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో తెనాలికి మాత్రమే సబ్‌ కలెక్టర్‌ హోదా ఉండేది. తెనాలి సరసన నరసరావుపేట డివిజన్‌ చేరింది. నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌గా 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీవాస్‌నూపూర్‌ అజయ్‌కుమార్‌ను ప్రభుత్వం శుక్రవారం నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 1947లో నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. ఇప్పటి వరకు 52 మంది ఆర్డీవోలు ఇక్కడ విధులు నిర్వహించారు. ఇక్కడ తొలి సబ్‌ కలెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారు. ఇక నుంచి పరిపాలనా పరమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. 


ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లును బదిలీ చేశారు. ఆయనకు ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఎటువంటి ముందస్తు లీకులు లేకుండా ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లును బదిలీ చేయడం డివిజన్‌లోని కొందరు రెవెన్యూ అధికారులను కంగు తినిపించింది. ఇక రాజకీయ పార్టీల నేతలు గంటల గంటలు ఆర్డీవో చాంబర్‌లో కుర్చొనే పరిస్థితులు ఉండవు. ఆర్డీవో బదిలీని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. 

Updated Date - 2020-08-08T14:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising