ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రాడీపేట.. లాక్‌డౌన్‌.. నేటి నుంచి కఠినంగా ఆంక్షలు

ABN, First Publish Date - 2020-07-04T17:59:58+05:30

గుంటూరులోని బ్రాడీపేటలో కరోనా విజృంభిస్తుండటంతో కంటైన్‌మెంట్‌ కార్యకలాపాలు చేపట్టాలని నగరపాలకసంస్థ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 15 దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని బ్రాడీపేటలో కరోనా  విజృంభిస్తుండటంతో కంటైన్‌మెంట్‌ కార్యకలాపాలు చేపట్టాలని నగరపాలకసంస్థ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య 15 దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఒక్క నాల్గో లైనులో అత్యవసర, నిత్యావసర వాహనాలు అనుమతించేందుకు వీలుగా గేటు ఏర్పాటు చేస్తున్నారు.


ఇక్కడే కంట్రోల్‌ రూంని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఇల్లు కూడా బ్రాడీపేటలోనే ఉన్నది. కంటైన్‌మెంట్‌ జోన్‌ కారణంగా ఆమె కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇక్కడే పలు బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలున్నాయి. ఇవన్ని 28 రోజులు మూతపడక తప్పని పరిస్థితి నెలకొన్నది. 

Updated Date - 2020-07-04T17:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising