సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలి
ABN, First Publish Date - 2020-11-13T06:15:04+05:30
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై వినుకొండ టీడీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు
వినుకొండ, నవంబరు 12: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై వినుకొండ టీడీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద గురువారం వారు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు సౌదాగర్ జానీబాషా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీమ్‌ఖాన్, ప్రముఖన్యాయవాది రామకోటేశ్వరరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయన్నారు. దాడులు ప్రోత్సహిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సలాం కుటుంబం మృతికి కారణమైన సీఐ, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గన్నమనేని వెంకయ్య, గద్దె వీరమస్తాన్‌రావు, తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, గోరంట్ల హనుమంతరావు, పెమ్మసాని రామకృష్ణ, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు జానీబాషా, సిద్ధయ్య, బాబావలి, గోల్డ్ కరిముల్లా, షబ్బీర్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T06:15:04+05:30 IST