ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ నీటి సమాచారం

ABN, First Publish Date - 2020-12-04T06:11:26+05:30

నాగార్జున సాగర్‌ నీటిమట్టం గురువారం నాటికి 589.20 అడుగులు(309.65 టీఎంసీలు) ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, డిసెంబరు 3: నాగార్జున సాగర్‌ నీటిమట్టం గురువారం నాటికి 589.20 అడుగులు(309.65 టీఎంసీలు) ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600, కుడి కాలువ ద్వారా 6006, మొత్తం ఔట్‌ఫ్లో 6,606 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో 6,606 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 881.00 అడుగులు(193.40 టీఎంసీలు) ఉంది.  

పులిచింతల సమాచారం


అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో 45.56 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు ఈఈ రఘునాథ్‌ తెలిపారు. 1200 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణకు విడుదల చేస్తున్నామన్నారు. ఎగువ నుంచి 1187 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుందని తెలిపారు. 

బ్యారేజి దిగువకు 2200 క్యూసెక్కులు

తాడేపల్లి టౌన్‌: పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 3700 క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్‌ జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 1500 క్యూసెక్కుల నీటి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ 70 గేట్లలో 3 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 2200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. 

పశ్చిమడెల్టాకు 1516 క్యూసెక్కుల నీరు

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణాపశ్చిమడెల్టాకు 1516 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద నీటి మట్టం 12.0 అడుగులు ఉండగా దిగువకు 2205 క్యూసెక్కులనీరు విడుదల చేస్తున్నారు. తూర్పుకాల్వకు 30, కొమ్మమూరుకాల్వకు 150 క్యూసెక్కులనీరు విడుదల చేశారు. 


Updated Date - 2020-12-04T06:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising