ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ పరీక్షలకు.. సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2020-09-20T14:21:40+05:30

సచివాలయ రాత పరీక్షలు కట్టుదిట్ట బందోబస్తు మధ్యన ఆదివారం ఉదయం జిల్లాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిరోజు హాజరుకానున్న 36,000 మంది

రెండు గంటల ముందుగానే అభ్యర్థులు చేరుకోవాలి

పరీక్ష సామగ్రి తరలింపు పూర్తి

పర్యవేక్షించిన కలెక్టర్‌, జేసీలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): సచివాలయ రాత పరీక్షలు కట్టుదిట్ట బందోబస్తు మధ్యన ఆదివారం ఉదయం జిల్లాలో ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌-19 మార్గదర్శకాల దృష్ట్యా  హాల్‌టిక్కెట్‌ల తనిఖీ నిమిత్తం అభ్యర్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల ని అధికారులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం రూట్‌ల వారీగా పరీక్షల సామగ్రిని సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు చేర్చారు.  జిల్లా కేంద్రంలోని స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ప్రక్రి యని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జాయిం ట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పి.ప్రశాంతి, జేసీ (ఆసరా) కె.శ్రీధర్‌రెడ్డి, జడ్పీ సీఈవో చైతన్య, డీఈ వో గంగాభవాని పర్యవేక్షించారు.


జిల్లాలో మొత్తం 14 కేటగిరీల సచివాలయ పోస్టులకు రాత పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నం వేళ ఈ పరీక్షలు జరుగుతాయి. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఒక్క సెకను ఆలస్య మైనా లోపలి కి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశా రు. తొలి రోజున 36 వేల మంది అభ్యర్థులు హాజ రు కానుండటంతో 212 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. వీడియోగ్రఫీ, సీసీ టీవీ రికార్డింగ్‌ కూడా చేపడుతున్నారు. హాల్‌ టిక్కెట్‌లో ఉన్న ఫొటోతో అభ్యర్థి ఒకలా ఉంటనే అనుమతిస్తారు. మాస్కు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందు జాగ్రత్తగా వాటర్‌ బాటిల్‌, శానిటైజర్‌ వెంట తెచ్చుకోవాలని అధికారు లు సూచించారు.


దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్స్‌ అందుబాటులో ఉంచుతోన్నారు. కొవిడ్‌ అనుమానితులు, బాధితుల కు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గ దులు ఏర్పాటు చేశారు. శని వారం స్టాల్‌ బాలికల ఉన్న త పాఠశాల వద్ద చీఫ్‌ సూ పరింటెండెంట్‌లు, ఇన్విజిలే టర్లు, సూపరింటెండెంట్లకు డ్యూటీలెటర్స్‌ ఇచ్చారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన సా మగ్రిని కూడా అంద జేశారు. కొవిడ్‌- 19 దృష్ట్యా భౌతిక దూరం పాటించాలని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ ఆలకిం చలేదు.  

Updated Date - 2020-09-20T14:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising