వెలగపూడిలో మళ్లీ ఉద్రిక్తత
ABN, First Publish Date - 2020-12-30T05:24:11+05:30
తమను కాలనీలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఓ వర్గం వెలగపూడిలో మంగళవారం ఆందోళనకు దిగింది.
వెలగపూడిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న ఆందోళనకారులు
పంచాయతీ రోడ్డుపై నడవనీయడం లేదంటూ ఓ వర్గం ఆందోళన
తుళ్లూరు, డిసెంబరు 29: తమను కాలనీలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఓ వర్గం వెలగపూడిలో మంగళవారం ఆందోళనకు దిగింది. హోం మంత్రి సుచరిత తమ బాధలు వినకుండా, కనీసం కారు కూడా ఆపకుండా వెళ్లారని ఆందోళనకారులు ఆరోపించారు. నిత్యావసరాలు, నీళ్లు తెచ్చుకోవటానికి పంచాయతీ బజారులో నుంచి వెళ్లనీయకపోవటం అమానుషమన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన వారితో పోలీసులు మాట్లాడారు. ప్రత్యామ్నాయ దారి చూపుతామని వారికి హామీ ఇచ్చారు. ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలని కోరారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
Updated Date - 2020-12-30T05:24:11+05:30 IST