ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాలను పరిశీలించిన నేతలు, అధికారులు

ABN, First Publish Date - 2020-11-29T05:51:01+05:30

తాడేపల్లి మండలంలోని గుండిమెడ, చిర్రావూరు, కొలనుకొండ, కుంచనపల్లి తదితర ప్రాంతాలలో నీటమునిగిన పంట పొలాలను అధికారులు, వివిధ పార్టీల నాయకులు శనివారం పరిశీలించారు.

ఈమనిలో నీటనానుతున్న వరిపంటను చిరంజీవికి చూపుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి, నవంబరు 28: తాడేపల్లి మండలంలోని గుండిమెడ, చిర్రావూరు, కొలనుకొండ, కుంచనపల్లి తదితర ప్రాంతాలలో నీటమునిగిన పంట పొలాలను అధికారులు, వివిధ పార్టీల నాయకులు శనివారం పరిశీలించారు. గుండిమెడ ప్రాంతంలో పొలాలలో నీరు నిలిచి ఉండడంతో తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి ఎక్స్‌కవేటర్‌ ద్వారా కాలువ తీసి, నీటిని మళ్లించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి శ్రీనివాసులు, హార్టికల్చర్‌ అధికారి బేబీ తదితరులు గుండిమెడ, చిర్రావూరు ప్రాంతాల్లో పొలాలను పరిశీలించారు. కొలనుకొండ, గుండిమెడ, చిర్రావూరు గ్రామాల్లో పొలాలను జనసేన రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. మాజీ ఎంపీటీసీ నూతక్కి ఏడుకొండలు, తెలుగురైతు నాయకులు అక్కినేని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కుంచనపల్లి, గుండిమెడ, ప్రాతూరు గ్రామాలలో  పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో రైతులు కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ బాలగంగాధర్‌రావు, శ్రీరాములు, ఏటుకూరు నాగేశ్వరరావు, బాషా నాయక్‌, శివయ్య, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

పంటలను పరిశీలించిన టీడీపీ, సీపీఐ నాయకులు


దుగ్గిరాల: నిగర్‌ తుపాను తాకిడికి నీటమునిగిన పంట పొలాలను శనివారం టీడీపీ నాయకులు పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు తదితరులు ఈమని, మోరంపూడి, దుగ్గిరాల గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయరావు, బాపనయ్య, కోటేశ్వరరావు, కాసరనేని కృష్ణ, మన్నం అశోక్‌, అంచే రవిచంద్‌, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. మంచికలపూడిలో సీపీఐ నాయకులు పర్యటించి పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జంగాల అజయ్‌కుమార్‌, యార్లగడ్డ శివయ్య తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-11-29T05:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising