జనవరి 9 నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
ABN, First Publish Date - 2020-12-31T05:25:31+05:30
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని పునరుద్ధరిస్తూ రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది.
గుంటూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని పునరుద్ధరిస్తూ రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్టణం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్(నెంబరు.02831) జనవరి 9నుంచి నిత్యం ఉదయం 6.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35కి తెనాలి, 1.20కి గుంటూరు, 7.40కి లింగంపల్లి చేరుకొంటుంది. లింగంపల్లి - విశాఖ పట్టణం జన్మభూమి ఎక్స్‌ప్రెస్(నెంబరు.02832) నిత్యం ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 11.45కి గుంటూరు, 12.30కి తెనాలి, రాత్రి 7.45కి విశాఖపట్టణం చేరుకొంటుంది.
Updated Date - 2020-12-31T05:25:31+05:30 IST