ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌లో క్వారంటైన్‌ సెంటర్‌

ABN, First Publish Date - 2020-03-27T09:18:16+05:30

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంగళగిరి ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి టౌన్‌, మార్చి 26 : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంగళగిరి ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి. ఓపీడీ భవనం కింది అంతస్తులో జ్వరం, శ్వాసకోశ లక్షణాలతో బాధపడే వారికి స్ర్కీనింగ్‌ చేస్తున్నామన్నాని పేర్కొన్నాయి. ఇప్పటివరకు 30 మంది రోగులకు స్ర్కీనింగ్‌ నిర్వహించగా... పలువుర్ని హోమ్‌ ఐసోలేషన్‌కు సిఫారసు చేసి, తదుపరి పరీక్షల కోసం గుంటూరు డీఎంహెచ్‌వోకు రిఫర్‌ చేసినట్టు తెలిపాయి. కోవిడ్‌పై ఎయిమ్స్‌ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు తరచు మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తూ రోగుల వివరాలను, రికార్డులను నిర్వహిస్తున్నట్టు ఎయిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానిత రోగుల కోసం జిల్లా అధికారులతో సంప్రదించి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో 60 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని తెలిపాయి. ఒకవేళ రోగుల ఆరోగ్యం క్షీణించినట్టయితే ఐసోలేషన్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-03-27T09:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising