వ్యవసాయ చట్టాలతో సంక్షోభం
ABN, First Publish Date - 2020-12-30T04:50:01+05:30
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉన్నాయని సంగం డెయిరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్‌బాబు అన్నారు.
గుంటూరు,(తూర్పు), డిసెంబరు 29: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉన్నాయని సంగం డెయిరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్‌బాబు అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనదీక్షలు మంగళవారం ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినపుడే సమస్యకు పరిష్కారం రొరుకుతుందని తెలిపారు. దీక్షలలో తూమాటి శివయ్య, కాలువ శ్రీధర్, వేణుగోపాల్, రంగారెడ్డి, బ్రహ్మయ్య, మాచవరపు నాగేశ్వరరావు, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, బేగం, ఎరుకలమ్మ, మణికంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:50:01+05:30 IST