ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ విధానాలపై కార్మిక వర్గాల నిరసన

ABN, First Publish Date - 2020-11-27T06:05:28+05:30

ప్రధాని మోదీ కార్పోరేట్‌ కంపెనీల జపం విడనాడాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొనసాగిన కార్మిక ప్రదర్శన


గుంటూరు(సంగడిగుంట): ప్రధాని మోదీ కార్పోరేట్‌ కంపెనీల జపం విడనాడాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా గురువారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు కార్మికులు వర్షంలోనే నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్నారు.  నగర తూర్పు కమిటీ కార్యదర్శి కట్లగుంట శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఏ అరుణ్‌కుమార్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీపీఐ(ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ కరోనా నేపఽథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు ఎన్‌వీ కృష్ణ, సీఐటీయూ నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, మున్సిపల్‌ కార్మికులు, ఆటో కార్మికులు, పోస్టల్‌ ఉద్యోగులు, ఇతర సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి, ఐఎఫ్‌టీయూ(న్యూ) రాష్ట్ర నాయకులు కిశోర్‌, నగర హమాలి, అంగన్‌వాడీ సంఘాల నాయకులు ఆంజనేయులు, రాధా, ఏపీఎన్జీవో నగర కార్యదర్శి ఎంఎన్‌మూర్తి, వివిధ సంఘాల నాయకులు రావుల అంజిబాబు, అరుణ్‌ కుమార్‌, బందెల రవికుమార్‌, ముత్యాలరావు, నికల్సన్‌, శ్రీనివాసరావు, రత్నం, డేవిడ్‌రాజు, ఎలీషారావు, విజయకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T06:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising