ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌జోన్లుగా మాచర్ల, కారంపూడి

ABN, First Publish Date - 2020-04-02T09:13:26+05:30

పల్నాడు పరిధిలోని మాచర్ల, కారంపూడిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించినట్లు రూరల్‌ ఎస్పీ విజయరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఏప్రిల్‌ 1: పల్నాడు పరిధిలోని మాచర్ల, కారంపూడిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించినట్లు రూరల్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. బుధవారం ఆయన రూరల్‌ జిల్లా పరిధిలోని పోలీసు అధికారులతో సెట్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.


ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన వారు ఇంకా ఎవరైనా ఉంటే వారు, వారి కుటుంబసభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కారంపూడిలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఒప్పిచర్ల మసీదులో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారని ఈ క్రమంలో ఆ ప్రాంతవాసులు కూడా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, కరోనా లక్షణాలు కనిపించినా 104, 1902, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. రెడ్‌జోన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  


Updated Date - 2020-04-02T09:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising