ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఖాకీ అధికారి.. అపర కీచకుడు..!

ABN, First Publish Date - 2020-07-08T17:44:31+05:30

జిల్లాలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌)లో విధులు నిర్వహిస్తున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెబ్‌లో మహిళా అధికారులకు లైంగిక వేధింపులు

అసభ్యకరంగా ప్రవర్తన.. వేధింపులు

ఉన్నతాధికారులు దృష్టి సారించాలి..


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌)లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి అపర కీచకుడుగా మారాడు. తన శాఖలోని మహిళా అధికారులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.vఆ అధికారి లైంగిక వేధింపులకు అనేకమంది మహిళా సీఐలు, ఎస్‌ఐలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. కొద్దికాలం కిందట ఓ మహిళా అధికారిని వేధించాడు. ఆమె తాను పనిచేస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటంతో ఎక్కడ ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తుందోనన్న భయంతో ఆమెను వదిలేశాడు.


ఆ తర్వాత మరో మహిళా అధికారిపై కన్ను పడింది. ఆమెతో తరచుగా మాట్లాడటంతో ఆమె గట్టిగా మందలించింది. తాజాగా మరో మహిళా అధికారిపై ఆయన దృష్టి మళ్లింది. దీంతో ఆమె తీవ్రంగా కలత చెంది ఏంచేయాలో అర్ధంకాక మిన్నుకుండిపోయింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు స్పందించి తగు రీతిన విచారణ జరిపితే జిల్లాలో ఓ సెబ్‌ అధికారి లైంగిక వేధింపులు బట్టబయలు కానున్నట్లు మహిళా అధికారులు ఆవేదన చెందుతున్నారు.


Updated Date - 2020-07-08T17:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising