ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణబాబు కాలనీలో కార్డన్‌ సెర్చ్‌

ABN, First Publish Date - 2020-12-28T06:17:42+05:30

నగరంలో కృష్ణబాబు కాలనీలో వెస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.

కృష్ణబాబుకాలనీలో మోహరించిన వెస్ట్‌ డీఎస్పీ సుప్రజ, పోలీస్‌ అధికారులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు, డిసెంబరు 27: నగరంలో కృష్ణబాబు కాలనీలో వెస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు వారి ఆధార్‌కార్డులను కూడా పరిశీలించారు. ఆయా వాహనాల రికార్డులను  పరిశీలించి ఎటువంటి డాక్యుమెంట్‌లు, నెంబర్‌ ప్లేట్‌లు లేని 25 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐదు కేసులు ఉన్నట్లు, కొంతకాలంగా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో  పాల్గొంటున్నట్లు నిర్ధారించారు. అనేకమంది మద్యం ప్రియలు మత్తు బిళ్ళలకు బానిసలైనట్లు పోలీసుల తనిఖీల్లో నిర్ధారించారు. కొత్తపేట, పాతగుంటూరు, లాలాపేట తదితర ప్రాంతాల్లోని మందుల షాపుల్లో ఈ మత్తు టాబ్లెట్‌లు విక్రయిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆయా ట్యాబ్లెట్‌ల విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుప్రజ తెలిపారు. వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని శివారు కాలనీలు, మురికివాడలు తదితర కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-28T06:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising