ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూరు శాతం అర్జీలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-09-27T10:24:36+05:30

గ్రామ, వార్డు సచివాలయాలలోని ప్రభుత్వ సేవల కోసం దాఖలు చేసిన అర్జీలను సత్వరవే పరిష్కరించాలి. అలానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

c

గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాలలోని ప్రభుత్వ సేవల కోసం దాఖలు చేసిన అర్జీలను సత్వరవే పరిష్కరించాలి. అలానే స్పందన ద్వారా అందిన ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించకపోతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్రామ/ వార్డు సచివాలయాల్లోని ప్రభుత్వ సేవల అర్జీలు, స్పందన ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం లోపు స్పందన అర్జీలను 100 శాతం, సచివాలయాలకు అందిన అర్జీల్లో గడువు దాటినవి సంపూర్ణంగా పరిష్కరించాలన్నారు.  జిల్లా అధికారులు ప్రతీ వారం నాలుగు సచివాలయాలను తనిఖీ చేసి వారి శాఖకు సంబంధించిన అర్జీలు పరిష్కారంపై నివేదికను శనివారం తనకు అందించాలన్నారు.  


ముగిసిన సచివాలయ పరీక్షలు

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఉదయం మత్స సహాయ కేటగిరీ పోస్టుకు రెండు పరీక్ష కేంద్రాల్లో 298 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 192 మంది వచ్చారు.  మధ్యాహ్నం పశుసంవర్థక సహాయకులు కేటగిరీ పోస్టుకు 115 మంది అభ్యర్థులకు 98 మంది పరీక్ష రాశారు. పరీక్షలు సజావుగా ముగియడంపై కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(సచివాలయాలు) పీ ప్రశాంతి, జేసీ(ఆసర) కే శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T10:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising