ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొమ్ము కేన్సర్‌కు అరుదైన శస్త్రచికిత్స

ABN, First Publish Date - 2020-12-17T05:58:05+05:30

ఒమెగా హాస్పిటల్స్‌లో అరుదైన కేన్సర్‌ శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ నుంచి ఆరు కిలోల బరువున్న రొమ్ము కేన్సర్‌ కణితిని (సిస్టో సార్కోమా ఫిలాయిడెన్‌) తొలగించారు.

ఒమెగా హాస్పిటల్స్‌ ఆంకాలజీ వైద్య బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు కిలోల బరువైన కణితి తొలగింపు

గుంటూరు (మెడికల్‌), డిసెంబరు 16: ఒమెగా హాస్పిటల్స్‌లో అరుదైన కేన్సర్‌ శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ నుంచి ఆరు కిలోల బరువున్న రొమ్ము కేన్సర్‌ కణితిని (సిస్టో సార్కోమా ఫిలాయిడెన్‌) తొలగించారు.  భారీ పరిమాణంలో ఉన్న రొమ్ము కేన్సర్‌ కణితి తొలగించడం మనరాష్ట్రంలో ఇదే తొలిసారని,  దేశంలో ఆరో కేసు మాత్రమే అని శస్త్రచికిత్స నిర్వహించిన చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎంజీ నాగకిషోర్‌ తెలిపారు. బుధవారం ఒమెగా హాస్పిటల్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్‌ నజీమా (33)నాలుగేళ్ల కిందట రొమ్ము కేన్సర్‌కు గురి కాగా, స్థానికంగా ఆపరేషన్‌ చేయించుకుంది. కొద్దికాలానికి మరోసారి రొమ్ము కేన్సర్‌ కణితి ఏర్పడింది. నాలుగేళ్ల వ్యవధిలో కేన్సర్‌ కణితి భారీసైజుకు పెరిగిపోవడంతో ఆమె కొద్ది దూరం నడిచినా ఆయాసం కలిగేది. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స కోసం ఇటీవల గుంటూరులోని ఒమెగా హాస్పిటల్‌లో చేరారు. వైద్యబృందం పరీక్షలు నిర్వహించి ఆపరేషన్‌ జరిపి 27 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ కణితిని తొలగించింది. భవిష్యత్తులో ఆమెకు మళ్లీ కేన్సర్‌ రాకుండా కీమోథెరపీ, రే డియేషన్‌ థెరపీ అందిస్తామన్నారు. సమావేశంలో ఆంకాలజిస్టులు డాక్టర్‌ శ్రీకాంత్‌ బోగా, డాక్టర్‌ జాస్తి విజయకృష్ణ, డాక్టర్‌ ఎన్‌వీఎస్‌ ప్రవీణ్‌, ఎనస్థటిస్ట్‌ డాక్టర్‌ శౌరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising