ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడి, పొడిచెత్త విభజన చేసి ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-12-17T06:16:50+05:30

నగరవాసులు రెండు డస్ట్‌ బిన్ల ద్వారా తడి పొడి చెత్త విభజన చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిందేనని లేకుంటే చెత్త తీసుకోరని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టంచేశారు.

డస్ట్‌బిన్లను పంపిణీ చేస్తున్న కమిషనర్‌ అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు (కార్పొరేషన్‌), డిసెంబరు 16: నగరవాసులు రెండు డస్ట్‌ బిన్ల ద్వారా తడి పొడి చెత్త విభజన చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిందేనని లేకుంటే చెత్త తీసుకోరని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టంచేశారు. కీర్తన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 32వ డివిజన్లో తడి పొడి చెత్త వేరువేరుగా సేకరణకు రెండు డస్ట్‌బిన్లను బుధవారం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛనగరం సాధించవచ్చని అన్నారు. చెత్తని వేరు చేసి ఇవ్వకుంటే పారిశుధ్య కార్మికులు తీసుకోరని చెత్త రోడ్ల మీద, కాలువల్లో వేస్తే అపరాధ రుసుం విధిస్తామన్నారు. ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌ మేరుగ విజయలక్ష్మి మాట్లాడుతూ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరపాలక సంస్ధ సూచించిన ప్రాంతాల్లో తడి పొడి చెత్త సేకరణకు డస్ట్‌ బిన్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి అంజనేయులు, ఏఈ అనూష, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, విజయ మాధవి, తిమ్మరాజు, ఆదారి, సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T06:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising