ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల శుభ్రత ప్రజలందరి బాధ్యత

ABN, First Publish Date - 2020-12-30T04:47:29+05:30

పరిసరాల పరిశుభ్రత ప్రజల బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు.

పర్యటిస్తున్న ఎంపీ, కలెక్టర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ అయోధ్య రామిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 29: పరిసరాల పరిశుభ్రత ప్రజల బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ గుంటూరు సాధనలో భాగస్వాములు కావాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఎమ్మెల్యే ముస్తఫా, మార్కెట్‌యార్డు చైౖర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, నగర కమిషనర్‌ చల్లా అనురాధతో పర్యటించారు. పారిశుధ్యంపై స్థానికులు, వ్యాపారులకు, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతివారం మార్కెట్‌, రైతు బజార్లను తనిఖీ చేస్తామన్నారు. బీఆర్‌ స్టేడియం అభివృద్ధిపై శాప్‌ అధికారులతో చర్చిస్తామన్నారు. ఆటోనగర్‌ దుకాణదారులు, పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు బ్యాగ్‌ ఫ్రం యువర్‌ హోం అనే నినాదాన్ని ప్రచారం చేయాలన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య,  తదితరులు పాల్గొన్నారు. 

- కలెక్టరేట్‌ ఆవరణలోని మత్స్య, డివిజనల్‌ ఫారెస్టు, జిల్లా పంచాయతీ కార్యాలయాలను కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌తో కలిసి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ నెల 31వ తేదీ లోపు ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో వ్యర్థాలు లేకుండా చేసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(ఆసర) శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. 

- యూజీడీ పెండింగ్‌ పనులు వెంటనే ప్రారంభించాలని ఎంపీ రామిరెడ్డి కాంట్రాక్టర్‌ ప్రతినిధులకు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నగర కమిషనర్‌, కాంట్రాక్టర్‌ ప్రతినిధులతో మంగళవారం యూజీడీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 


Updated Date - 2020-12-30T04:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising