ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో వైసీపీ విఫలం

ABN, First Publish Date - 2020-08-11T09:44:37+05:30

రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓ ప్రకటనలో ఆవేదన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంపీ గల్లా జయదేవ్‌


గుంటూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు.  స్వయానా, మంత్రులు, ప్రజాప్రతినిధులే సామాజిక దూరం పాటించకుండా, ఇష్టారీతిగా తిరుగుతూ వైరస్‌ వ్యాప్తి ఎక్కువ చేశారని మండిపడ్డారు.


ప్రస్తుతం అత్యధిక మరణాలు కర్నూలు, తర్వాత స్థానంలో గుంటూరు ఉండటం బాధాకరమన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం తప్పా నివారణచర్యలు మాత్ర శూన్యమని విమర్శించారు. డాక్టర్ల పట్ల, బాధితుల పట్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరిస్తూ మొదటి నుంచి కరోనాపై అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ద్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి జరిగిందని... కేసుల ట్రేసింగ్‌ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వ్యవస్థలను మోసం చేస్తున్నదని , రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారని గల్లా ప్రశ్నించారు. ముఖ్యమంత్రే మాస్కు పెట్టుకోకపోతే ఎలా అని నిలదిశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక ప్రజలు నష్టపోతున్నారని గల్లా జయదేవ్‌ అన్నారు. 

Updated Date - 2020-08-11T09:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising