ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ సిటీగా తీర్చిదిద్దుదాం

ABN, First Publish Date - 2020-12-06T04:13:40+05:30

గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 5: గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ  ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. కమిషనర్‌ చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో తయారయ్యే వ్యర్ధాలను తడి పొడి చెత్తలుగా విభజించి సిబ్బందికి అందజేయాలన్నారు. అనంతరం గుంటూరు నగరానికి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ను తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వివరాలు, వాటిని అభివృద్ధికి అంచనాలను సిద్ధం  చేసి అందజేయాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు టి.వెంకటకృష్ణయ్య, డిశ్రీనివాసరరావు, బి.శ్రీనివాసరావు, ఎస్‌ఈ రవికృష్ణరాజు, డిప్యూటీ సిటీ ప్లానర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత నగర కమిషనర్‌ చల్లా అనురాధ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, మోదుగల వేణుగోపాల్‌రెడ్డి, కావటి మనోహర్‌ నాయుడు, షౌకత్‌, పాదర్తి రమేష్‌ గాంధీతో కలిసి సంపత్‌నగర్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, బృందావన్‌ గార్డెన్స్‌, పాత గుంటూరు పరిధిలో నిర్మాణలు,  రెడ్‌ ట్యాంక్‌  కాంప్లెక్స్‌లను  తనిఖీ చేశారు. 

Updated Date - 2020-12-06T04:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising