ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యథేచ్ఛగా జూదం, కోడిపందేలు

ABN, First Publish Date - 2020-12-02T05:13:17+05:30

జూదం, కోడిపందేలకు నిలయంగా నిజాంపట్నం, రేపల్లె, నగరం మండలాలు ఉన్నాయని స్వయానా డీజీపీ సీసీకి తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అనగాని

రేపల్లె, డిసెంబరు 1: జూదం, కోడిపందేలకు నిలయంగా నిజాంపట్నం, రేపల్లె, నగరం మండలాలు ఉన్నాయని స్వయానా డీజీపీ సీసీకి తెలిపినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోని టోల్‌ఫ్రీ ఫోన్‌ నెంబరు ఎందుకని ఆయన ప్రశ్నించారు. డీజీపీ సీసీని అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. నిజాంపట్నం శివారు చింతరేవు, మునిరేడులలో పేకాట జరుగుతున్నా ఎవరూ దృష్టి సారించటం లేదన్నారు. ఇది వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తోందని ఆరోపించారు. తక్షణమే సీఎం జగన్మోహనరెడ్డి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. 


Updated Date - 2020-12-02T05:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising