ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ఏ రోగి ఇబ్బంది పడకూడదు

ABN, First Publish Date - 2020-12-20T04:48:15+05:30

వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ఏ రోగి ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ, డిసెంబరు 19 : వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ఏ రోగి ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక ప్రభుత్వవైద్యశాలలో శనివారం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారంతో పాటు వైద్యాధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ముందుగా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు కొత్తమాసు శివ, గౌస్‌బాషా(కాంట్రాక్టర్‌), ఆరె సామ్రాజ్యంలతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది సేవలు అందిస్తున్నారని, రానున్న రోజుల్లో ఎన్‌ఎస్‌పీ స్థల ఆవరణలో సుమారు 6 ఎకరాలలో నూతన వైద్యశాలను నిర్మించి తీరుతామన్నారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన సుమారు రూ.2.10 కోట్లతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపడతామన్నారు. ఈపూరు ప్రభుత్వవైద్యశాలకు గతంలో కేటాయించిన రూ.6 కోట్ల నిధులను సైతం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఓపీని దృష్టిలో పెట్టుకొని వైద్యశాల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. త్వరలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 15 ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.  

Updated Date - 2020-12-20T04:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising